గత మే 30న అధికారం చేపట్టిన జగన్ నిత్యం సెక్రటేరియట్ కు వెళుతూ తన అధికారిక కార్యక్రమాలను చక్కపెడుతూ వస్తున్నారు. అయితే ఇటీవల అయన సచివాలయానికి వెళ్ళడం కాస్త తగ్గించారు. దీనికి ముఖ్య కారణం కూడా ఉంది.. తాజాగా ఉద్యోగుల, అధికారుల సాధారణ బదిలీలపై నిషేదాన్ని జగన్ ఎత్తివేశారు. దీనితో తమ బదిలీలకోసం అనేకమంది ఉద్యోగులు సచివాలయంలో ఉన్న అధికారులను, నేతల్ని కలవడానికి తండోపతండాలుగా వస్తున్నారు. కొందరు తమకు కావాల్సిన చోటికి బదిలీలు చేయించాలని వైసిపి నాయకులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యమంత్రిని కలిసి పని జరిపించుకోవాలని చాలామంది ఇలా వస్తున్నారు. అయితే జగన్ మాత్రం బదిలీల్లో ఎలాంటి లాబీయింగ్ లేకుండా అన్నీ పారదర్శకంగా జరగాలని ఆదేశించారు. అయినా బదిలీలపై వెంటబెట్టుకుని సచివాలయానికి తరలివస్తుండటంతో వైసిపినేతలు కూడా సీఎం కోసం సెక్రటేరియట్ వద్దకు చేరుకుంటున్నారు. దీనివల్ల సీఎం చేయాల్సిన పాలనా నిర్ణయాలు, సమీక్షలకు సమయం వేస్ట్ అయిపోతుందని జగన్ పేషీ ఫిర్యాదులు.. దీంతో బదిలీల విషయంలో పారదర్శంగా ఉండాలని సీఎం వైసీపీ నాయకులకు చెప్పడంతోపాటుగా ఈ ప్రక్రియ ముగిసేవరకు సెక్రటేరియట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.. దీంతో క్యాంప్ కార్యాలయం నుండే అన్ని పనులు చూసుకుంటున్నారు. అలాగే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద భారీగా ధర్నాలు చేస్తున్నారు.. సీఎం బయటకు వెళ్లేపుడో లోనికి వచ్చేటపుడో వారిని చూడటం.. చూసి ఆయా సమస్యలపై అధికారులను, ఆదేశించడం లేదా సీఎం నేరుగా సమీక్ష చేయడం ద్వారా జగన్ సమయం వృధా అవుతుందని, సీఎం చేయాల్సిన పనులు పెండింగ్ పడిపోతున్నాయని పోలీసులు అధికారులు, ఉన్నతాధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. దీంతో గుంటూరు రూరల్ మొత్తం ధర్నాలు, నిరసనలపై నిషేధం విధించారు. తాడేపల్లి పట్టణంతో సహా మిగిలిన గుంటూరు అర్బన్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిరసనలు నిర్వహించేందుకు అవకాశం లేదు. చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు ఎవరు హాజరు కావడం గానీ మద్దతు తెలపడం చేయరాదని గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ తెలియజేసారు. అయితే మరో 6 నెలలు గడిస్తే పాలనద్వారా, ప్రజా దర్బార్ ద్వారా సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అధికారులు చెప్తున్నారు.
