ముద్రగడ పద్మనాభం.. కాపు ఉద్యమ నాయకుడు.. గత ప్రభుత్వ హయాంలో కాపుల ఉద్యమాన్ని ఉదృతం చేసిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే ముద్రగడను చంద్రబాబు తీవ్రంగా హింసించడం.. లోకేశ్ దారుణంగా మాట్లాడడం.. ముద్రగడ భార్య, కోడలిని దారుణంగా బూతులు తిట్టడం, ముద్రగడ కొడుకును దారుణంగా కొట్టడం వంటివి చూసాం.. అయినా ముద్రగడ టీడీపీతో సత్సంబంధాలు కొనసాగించారు. అది వేరే విషయం.. అయితే ఇదిలా ఉండగా తాజాగా సీఎం జగన్ కి ముద్రగడ ఓలేఖ రాశారు. “చంద్రబాబు కాపులను దారుణంగా మోసం చేశారు. మీరు ఇపుడు సీఎంఅయ్యారంటే మా కాపు జాతి మిమ్మల్ని గట్టిగా నమ్మి ఓటేసిందని నేను భావిస్తున్నారు. మీరు కూడా భావిస్తే మా జాతికి మేలు చేయండి” అంటూ ఆ లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. అలాగే కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇస్తానని అయిదేళ్ళు పొద్దు పుచ్చిన చంద్రబాబు కేంద్రం అగ్రవర్ణాలకు ఇచ్చిన పదిశాతం రిజర్వేషన్లలొ అయిదుశాతం ఇచ్చారని చెప్పారు. అయితే ఆ ఐదు శాతం రిజర్వేషన్లకు సంబంధించి జీవో మాత్రం ఇంకా రాలేదని ముద్రగడ అన్నారు. ఆనాడు చంద్రబాబు గ్లోబల్ ప్రచారం అలా చేసుకున్నారని విమర్శించారు. ఇప్పుడు సీఎం హోదాలో మీరు ఆ జీవోను విడుదల చేయించి కాపులను ఆదుకోవాలని కోరారు. ఈ విషయంలో సాధ్యమైనంత వేగంగా జీవో తెస్తే కాపు యువతకు విద్య, ఉదోగావకాశాలు అందుబాటులోకి వస్తాయని ముద్రగడ సూచించారు. అయితే కాపులకు న్యాయం కోసం ముద్రగడ జగన్ కి లేఖ రాయడం ద్వారా తిరిగి మళ్లీ తన పోరాటం ప్రారంభించారనుకోవచ్చు.. అయితే చంద్రబాబులా జగన్ వ్యవహరిస్తారా స్మార్ట్ గా ఈ అంశాన్ని డీల్ చేస్తారా అనేది వేచి చూడాలి. అయితే తాను కాపుల్ని బీసీల్లో చేర్చలేనని జగన్ స్పష్టంగా ఎన్నికలకు ముందు తేల్చి చెప్పారు. అయినా ఏదో ఒకరకంగా కాపులు తమకు జగన్ న్యాయం చేస్తారని నమ్మి ఓట్లేయడం ఇక్కడ జగన్ పై వారు పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
