వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో భాగంగా ఈ రోజు మంగళవారం తొలి సెమి ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా న్యూజీలాండ్ జట్టుతో తలపడుతుంది. అందులో భాగంగా ముందు టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ను ఎంచుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బలాలు బలహీనతలు ఎంటో ఒక లుక్ వేద్దాం .భారత్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వరుస సెంచురీలతో సూపర్బ్ ఫామ్లో ఉండటం ప్రధాన బలం.
ఇంకా టాప్ ఆర్డర్ కూడా ఫామ్ లో ఉండటం.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ తనవంతు ప్రోత్సాహాం అందించడం కూడా టీమిండియాకు కల్సివచ్చే అవకాశం. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా భువనేశ్వర్ పేస్ దళం కూడా ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మిడిలార్డర్ నిలకడగా రాణించకపోవడం.. స్పిన్నర్లు రాణించకపోవడం కూడా టీమిండియాకు ప్రధాన బలహీనతలు..