తెలుగుదేశం పార్టీకి విశేష సేవలందించిన చందు సాంబశివరావు టిడిపిని వీడనున్నారు. 15 సంవత్సరాలుగా టీడీపీ అధికార ప్రతినిధిగా విశేష సేవలందించిన ఈయన తనకు ఏమాత్రం గుర్తింపు రాలేదనే బాధతో ఆపార్టీకి రాజీనామా చేసారు. చందు ప్రస్థానం అంతరిక్ష శాస్త్రవేత్త గా మొదలైంది.. అమెరికాలోని మూడు విశ్వవిద్యాలయాలనుండి ఉన్నత చదువులు (ISRO / NASA) చదివారు. అలాగే అమెరికన్ గవర్నమెంట్ లో పనిచేసిన అనుభవం కూడా ఉంది.. ప్రాజెక్ట్ మానేజ్మెంటు నిపుణుడిగా గుర్తింపు తెచ్చుకున్న చందు టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2004లో దుగ్గిరాల నుండి మొదటిసారి శాసనసభకు పోటీ చేసారు. 2004-09 కాలంలో దుగ్గిరాల టీడీపీ ఇంచార్జిగా సేవలందించారు. టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా అనేక నియోజకవర్గాలలో పనిచేసిన అనుభవంతోపాటు బలమైన సామాజకవర్గం ప్రతినిధిగా టీడీపీకి విశేష సేవలందించారు.. అయితే టీడీపీ ఇన్నేళ్లుగా తనను గుర్తుంచుకోకపోవడంతోపాటు, ఇప్పట్లో టీడీపీ కోలుకునే పరిస్థితి లేకపోవడంతో బీజేపీ చేరనున్నట్టు వెల్లడించారు. బీజేపీ విధానాలు దేశాభివృద్ధికి తోడ్పడుతున్నాయని, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలనే ఆశయంతో బీజేపీలోకి వెళ్తున్నట్టు స్పష్టం చేసారు. దేశ సమగ్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమనే అభిప్రాయంలో చందు బీజేపీలోకి వెళ్తున్నట్టు చెప్తున్నారు.
