టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు ,బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు తన 47వ జన్మదినం జరుపుకుంటున్న సంగతి తెల్సిందే. దాదా పుట్టిన రోజు సందర్భంగా సినీ రాజకీయ క్రికెట్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు బర్త్ డే విషెష్ చెబుతున్నారు. అభిమానుల ఆనందానికి అయితే అవధుల్లేవు. తమ అభిమాన ఆటగాడు పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు,ఆసుపత్రుల్లో,అనాధ ఆశ్రమాల్లో దుస్తులు,పండ్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తోన్నారు. ఈ క్రమంలో దాదాకు టీమ్ ఇండియా డ్యాషింగ్ అండ్ డేరింగ్ బ్యాట్స్ మెన్ వీరెంద్ర సెహ్ వాగ్ వినూత్న శైలీలో శుభాకాంక్షలు తెలిపారు. అందులో భాగంగా వీరు కెప్టెన్ 56 ,దాదాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. 56అంగుళాల ఛాతి.. ఇది ఏడో నెలలో 8వ తేది 7*8=56.నీ ప్రపంచకప్ యావరేజ్ కూడా 56అని గంగూలీ ఫోటో పోస్టు చేస్తూ బర్త్ డే విషెష్ చెప్పాడు..
