ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ నేత జలగం సుధీర్ కు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,యువనేత కే.టీ.రామారావు ఈ రోజు సుధీర్ పుట్టిన రోజు పురస్కరించుకుని ఫోన్ లో “జన్మ దిన శుభాకాంక్షాలు” తెలిపారు.ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, సమాజ సేవలో ముందుండి ప్రజాభిమానం పొందాలని ఆయన ఆకాక్షించారు. తన పుట్టిన రోజున ప్రత్యేకంగా ఫోన్ ద్వారా శుభాకాంక్షాలు తెలిపిన యువనేతకు జలగం తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఆయన నాయకత్వం లో పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటానని ఆయన అన్నారు.
