ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా విజయాలతో దూసుకుపోతుంది ముద్దుగుమ్మ సమంత. వివాహం అయిన తర్వాత పలు వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక్కో మెట్టు ఎక్కుతుంది అందాల రాక్షసి. అందులో భాగంగా ఇటీవల తన భర్త నాగ చైతన్యకు జోడీగా నటించిన మజిలీ మంచి విజయం సాధించడంతో ఆనందంలో ఉన్న సామ్ తాజాగా విడుదలైన ఓ బేబీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు.
కొరియన్ సినిమా మిస్ గ్రానీ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం వసూళ్లలో దుసుకుపోతోంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో సమంత వైట్‌డ్రెస్‌లో తళుక్కుమన్నారు. ఈ క్రమంలో ఫొటోషూట్‌లో పాల్గొన్న సమంత సోషల్‌మీడియా వేదికగా తన భావాలను అభిమానులతో పంచుకున్నారు.
‘ అత్యుత్తమ జీవితాన్ని గడుపుతున్నాను… ఇన్నాళ్లు ఎవరికీ కనిపించకుండా దాచిన టాటూను ఫైనల్‌గా చూపించేస్తున్నాను. నా భర్త చై నా ప్రపంచం’ అంటూ తన భర్త పేరుతో ఉన్న టాట్టూను రివీల్ చేశారు. ఈ క్రమంలో సమంత ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటో… సామ్ అభిమానులను ఆకట్టుకుంటోంది.