నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి త్వరలో మరో షాక్ తగిలే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా రాష్ట్రంలో తూర్పు గోదావరికి చెందిన టీడీపీ కీలకనేత, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరావు ఆ పార్టీకి టాటా చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన బొడ్డు అధికార పార్టీ అయిన వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకుగాను తన అత్యంత సన్నిహితులతో బొడ్డు మంతనాలు జరుపుతున్నారు.అయితే తను వైసీపీలో చేరికపై సోమవారం నాడు ప్రకటన వెల్లడిస్తారని తెలుస్తోంది. బొడ్డుకు తూర్పుగోదావరి జిల్లాలో పట్టున్న సీనియర్ నేతగా మంచి పేరుంది.
