Home / ANDHRAPRADESH / జమ్మలమడగులో జగన్ …ఆదినారాయ‌ణ రెడ్డి ఎక్క‌డ ఉన్నారు..సీఎం ఏం చెప్ప‌బోతున్నారు

జమ్మలమడగులో జగన్ …ఆదినారాయ‌ణ రెడ్డి ఎక్క‌డ ఉన్నారు..సీఎం ఏం చెప్ప‌బోతున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ తొలి సారి క‌డ‌ప జిల్లాకు వెళ్తున్నారు. ముఖ్య‌మంత్రి హోదాలో మ‌ర‌ణించిన త‌న తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ‌న్మ‌దినం జూలై 8న ముఖ్య‌మంత్రి హోదాలోనే జ‌గ‌న్ నివాళి అర్పించ‌నున్నారు. అదే రోజు త‌న తండ్రికి నివాళిగా ఆ రోజును రైతు దినోత్స‌వంగా జ‌ర‌పాల‌ని వైఎస్ జగన్ నిర్ణ‌యించారు. అదే రోజు త‌న హాయంలో పెంచిన సామాజిక పెన్ష‌న్ల‌ను జ‌గ‌న్ పంపిణీ చేయ‌నున్నారు. దీంతో పాటుగా రైతుల‌కు సంబంధించిన అనేక కార్యక్ర‌మాల‌ను సీఎం ప్రారంభిస్తారు. వీటికి జ‌మ్మ‌ల‌మ‌డుగు వేదిక కానుంది. ముఖ్య‌మంత్రి జ‌మ్మ‌ల‌మ‌డుగునే ఎందుకు ఎంచుకున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి ఎక్క‌డ ఉన్నారు..జ‌గ‌న్ అక్క‌డ ఏం చెప్ప‌బోతున్నారు అనేది చ్చనీయాశం అయ్యింది. జ‌గ‌న్ జ‌మ్మ‌ల‌మ‌డుగులోకి అడుగు పెడుతున్న వేళ అంద‌రి దృష్టి మాజీ మంత్రి ఆది నారాయ‌ణ రెడ్డి మీదే ఫోక‌స్ ఉంది.వైసీపీ నుండి గెలిచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయిన ఆదినారాయ‌ణ రెడ్డి శాస‌న స‌భ‌లో..బ‌య‌టా జ‌గ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసి అనేక విమ‌ర్శ‌లు..ఆరోప‌ణ‌లతో పాటుగా ప‌లు సంద‌ర్భాల్లో ఎద్దేవా చేసారు. ఏది అడిగినా జ‌గ‌న్ తాను ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత అంటూ స‌మాధానం ఇస్తార‌ని..జ‌గ‌న్ ఈ జ‌న్మ‌లో సీఎం అయ్యేది లేద‌ని హేళ‌న‌గా మాట్లాడేవార‌ని వైసీపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. తాజా ఎన్నిక‌ల్లో క‌డ‌ప ఎంపీగా పోటీ చేసి..జమ్మ‌ల‌మ‌డుగులో రామ‌సుబ్బారెడ్డి పోటీ ఖ‌చ్చితంగా జ‌మ్మ‌ల‌మ‌గుడులో గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేసారు. ఎన్ని క‌ల స‌మ‌యంలో వివేకా మ‌ర‌ణం స‌మ‌యంలోనూ అదినారాయ‌ణ‌రెడ్డి మీద ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ అధికారంలోకి రావ‌టంతో జ‌మ్మ‌ల‌మ‌డుగులో వైసీపీ గెల‌వ‌టంతో ఆదినారాయ‌ణ రెడ్డి పూర్తిగా రాజ‌కీయాల‌కు దాదాపు దూరంగా ఉంటున్న ప‌రిస్థితి కనిపిస్తోంది. అంతేకాదు జగన్ జమ్మలమడుగు వస్తుంటే ..ఆది నారాయణ రెడ్డి ఖచ్చితంగా జమ్మలమడుగులో ఉండరని అనుకుంటున్నారు వైసీపీ అభిమానులు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat