మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా? .మీరు శరీరంలో కేలరీలు తగ్గించుకోవాలనే తపన ఉన్నా జిమ్‌కు వెళ్లేంత సమయం మీకు లేదా? అయితే రోజూ ఒక గంట సేపు సైకిల్ తొక్కండి. వీలైతే ఆఫీసుకు కూడా
సైకిల్ మీదే వెళ్లండి. సైక్లింగ్‌కు మించిన వ్యాయామం లేదని, సరైన శరీరాకృతికి సైక్లింగ్ ఉపయోగపడుతుందని డెన్మార్క్‌లోని కొపెన్‌గన్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. వారానికి ఐదుసార్లు జిమ్‌కు వెళ్లి
వ్యాయామం చేస్తే శరీరంలో ఎంత కొవ్వు కరుగుతుందో, రోజూ ఓ గంట సేపు సైకిల్ తొక్కినా అదే స్థాయిలో కొవ్వు కరుగుతుందని వారు చెప్పారు. స్థూలకాయంతో బాధపడుతున్న 130 మందిపై పరిశోధన చేసి ఈ
విషయాన్ని గుర్తించామని వారు చెప్పారు.
