తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులకు బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల నగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు సరికొత్త సిగ్నలింగ్ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి విదితమే. ఈ క్రమంలో పలుచోట్ల ఉన్న కూడళ్లల్లో జీబ్రా క్రాసింగ్స్ వద్ద పలు రంగులు మారే ఎల్ఈడీ లైట్లను అమర్చారు. దీంతో సిగ్నల్స్ దగ్గర రెడ్ సిగ్నల్ పడేలోపు ఈ ఎల్ఈడీ లైట్లు ఎరుపు రంగుతో సహా పలు రంగులతో వెలుగుతాయి.అయితే వెంటనే వాహానదారులు దిన్ని గమనించి ఆగిపోవాలి. వాహానదారులు ఆగిపోవడంతో పాదచారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్లను దాటుతున్నారు. ఈ సరికొత్త విధానం తన దృష్టికి రావడంతో బిగ్ బి తన ట్విట్టర్ ఖాతాలో ఫోటోను షేర్ చేస్తూ హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ పోలీసుల పనితీరును ప్రశంసించారు.ఈ విధానం బాగుందని కితాబిచ్చాడు బిగ్ బి..
