నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నవ్యాంధ్ర ప్రజలకు మరో శుభవార్తను తెలిపారు. ఈ క్రమంలో అన్ని వర్గాల ప్రజలు తమ తమ బిడ్డలను ఉన్నత చదువులను చదివించడానికి తలకుమించిన అప్పులు చేస్తున్న సంగతి తెల్సిందే.
అయితే వీరందర్నీ దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ గ్రామాల్లో ఉన్నవారు లక్షలకు ఫీజులు కట్టడం కష్టమని భావించి నూటికి నూరు శాతం ఫీజు రీయింబర్స్ మెంట్అమలు చేస్తామని ప్రకటించారు. అయితే బడులు,కళాశాలల ఫీజు నియంత్రణ ,పర్యవేక్షణ కోసం ఒక రెగ్యులేటరీ వ్యవస్థను తీసుకొస్తామని ఆయన తెలిపారు.
ఇందుకు తగిన చట్టం కూడా చేస్తామని వివరించారు.అంతేకాకుండా స్థానికంగా ఏర్పాటు చేసే కంపెనీలల్లో డెబ్బై శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం కూడా చేస్తామని ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో మౌలికవసతులు కల్పించాలని కూడా అధికారులను ఆదేశించారు..