కేంద్ర బడ్జెట్‌పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తు ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు . పార్టమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉందన్నారు. రాష్ట్ర విజ్ఞప్తులను కేంద్రం పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఈ రెండు పథకాలకూ రూ.24 వేల కోట్లు ఇవ్వాలని గతంలో నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందనీ, అయితే కేంద్రం 24 రూపాయలు కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో కనీసం ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినప్పటికీ, రాష్ట్ర ప్రాజెక్టులను కేంద్రం విస్మరించిందని కేటీఆర్ ట్విట్టర్‌లో ప్రస్తావించారు.
Tags central budget 2019 ktr telangana Twitter