వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన పార్టీలకు అతీతంగా జరుగుతోందని అనుకోవాలి. ఓ మీడియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం రాయలసీమలో పేకాటక్లబ్ లపై దాడి చేసినప్పుడు అరెస్టు అయినవారిలో వైసీపీ ఎమ్మెల్యే తండ్రి కూడా ఉన్నారట. ఆయన పేరు రాయలేదు కాని ఇంతవరకు రాశారు.ఆయనతో పాటు ఇంజినీర్లు, ప్రొఫెసర్లు ఉన్నారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా జరిమానా విధించింది. ఇక చిత్తూరు జిల్లా పలమనేరులో పేకాట శిబిరాలపై దాడి చేసిన పోలీసులకు 50 మంది పేకాటరాయుళ్లు చిక్కారు. ఇక్కడ పట్టుబడినవారిలో లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయనేతలు ఉన్నారు. అటు కర్నూలు క్లబ్, యునైటెడ్ క్లబ్, ఆఫీసర్స్ క్లబ్‌లోనూ పోలీసుల సోదాలు నిర్వహించారు. పలువురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోందని రాశారు. పేకాట క్లబ్ లపై దాడులు చేయాలని ఇప్పటికే జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. గతంలో టీడీపీ హాయంలో ఇలాంటి వి జరగడమే తక్కువగా ఉండేది.ఒకవేళ దొరికినా టీడీపీ వాళ్ల జోలికి వెళ్లడానికి పోలీసులు వెనుకాడేవారు. ఇప్పుడు జగన్ ఇచ్చిన ఆదేశాలతో శభాస్ అనిపించుకుంటున్నారు.
