ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటివరకు తాను తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేత పై సంచలన నిర్ణయం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ఆక్రమ కట్టడంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా ఉంది.ఈమేరకు ఆ ఇంటికి కూడా ప్రభుత్వం నోటిసులు ఇచ్చింది.దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదిక చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. లింగమనేని గెస్ట్‌హౌస్‌ను ల్యాండ్‌పూలింగ్‌లో సేకరించి ప్రభుత్వ అతిథి గృహంగా మార్చినట్టు మార్చి 6, 2016 న చంద్రబాబు ప్రకటించారు. రికార్డుల్లో మాత్రం అది ఇప్పటికీ లింగమనేని పేరనే ఉంది. తర్వాత దాని రెనోవేషన్ కోసం 8 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంతకీ అది ఎవరిదో చంద్రబాబు గారే చెప్పాలి?
లింగమనేని గెస్ట్‌హౌస్‌ను ల్యాండ్‌పూలింగ్‌లో సేకరించి ప్రభుత్వ అతిథి గృహంగా మార్చినట్టు మార్చి 6, 2016 న చంద్రబాబు ప్రకటించారు. రికార్డుల్లో మాత్రం అది ఇప్పటికీ లింగమనేని పేరనే ఉంది. తర్వాత దాని రెనోవేషన్ కోసం 8 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంతకీ అది ఎవరిదో చంద్రబాబు గారే చెప్పాలి?
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 5, 2019