ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సృష్టించిన సునామీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఫ్యాన్ స్పీడ్‌కు టీడీపీ శ్రేణులు కకావికలమయ్యారు. ఐదేళ్లుగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం సాగించిన ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడుతూ వైసీపీకి అపూర్వ విజయాన్ని కట్టబెట్టారు. ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు 14స్థానాల్లో వైసీపీ విజయభేరి మోగించింది జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించి వైసీపీ పట్టు నిలుపుకుంది. దీంతో కర్నూల్ జిల్లాలో పేరుపొందిన రాజకీయ కుటుంబాలన్నీ ఇంటిబాట పట్టాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న, చేరిన కేఈ, కోట్ల కుటుంబాలతో పాటు భూమా, బుడ్డా, గౌరు కుటుంబాలకు రాజకీయంగా ప్రజలు సమాధి కట్టారు. గతంలో కోట్ల, కేఈ కుటుంబాల మనుగడ కోసం బలైపోయిన వారి ఆత్మక్షోభ సాక్షిగా నేడు ప్రజాతీర్పు వెలువడటం జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి నేతల అంతరంగం ఒక్కటేనన్న విషయాన్ని జీర్ణించుకోలేని అభిమానులు తమ ఆత్మాభిమానాన్ని చంపుకోలేమని నిక్కచ్చిగా తేల్చిచెప్పారు. ఓటుతో తగిన బుద్ధి చెబుతూ లోప భూయిష్టమైన రాజకీయాలకు ఇకనైనా స్వస్తి పలకాలని ఆ నేతలకు ప్రత్యక్షంగా హితవు పలికారు. దీంతో మాజీ ఉప ముఖ్యమంత్రి కేయి కృష్ణమూర్తి ఇక రాజకీయాలకు గుడ్ బై చెబుతునట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తన వారసుడు కేయి శ్యాంబాబును గడిచిన ఎన్నికల్లో పత్తికొండ నియోజక వర్గం నుండి బరిలో నిలిపారు. అయితే ఫ్యాన్ సునామిలో గెలవలేక పోయారు. ఇక తన వారసుడిని పోటి చేయించి తను రాజకీయాలకు స్వస్తీ చెప్పాలనే కేయి కృష్ణమూర్తి అనుకున్నారంట. మరి ఇందులో ఏంత నిజముందో తెలియాలంటే మరి కోన్ని రోజులు ఆగాల్సిందే.
