సాధారణంగా కేంద్ర బడ్జెట్ అనగానే బ్రౌన్ కలర్ బ్రీఫ్‌కేస్ గుర్తుకు వస్తుంది ! పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆర్థిక మంత్రులు.. ఆ రోజున పార్లమెంట్లో బడ్జెట్ ప్రతులను బ్రౌన్ కలర్ బ్రీఫ్‌కేస్‌లో తేవడం సాంప్రదాయం. అయితే బ్రిటీష్ కాలం నాటి ఆ ఆచారానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్రేక్ వేసేశారు. ఫుల్ టైం మహిళా ఆర్థిక మంత్రిగా ఇవాళ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా.. కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. బడ్జెట్ ప్రతులను బ్రీఫ్‌కేసులో కాకుండా.. ఎర్రటి వస్త్రంతో మూటకట్టిన ప్యాక్‌లో ఆమె బడ్జెట్ ప్రతులను పార్లమెంట్‌కు తీసుకువెళ్లారు. ఎరుపు రంగు వస్త్రంలో ఉన్న బడ్జెట్ బ్యాగ్‌పై జాతీయచిహ్నం ఉంది.
