ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే లభించింది. ఏపీకి సంబంధించి జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు గురించి, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు గురించి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు అంశాన్ని కానీ ఆమె పేర్కొనలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ తెలుగు ప్రజలకు నిరాశను మిగిల్చింది. తెలంగాణకు సంబంధించి ఎటువంటి నిధుల విడుదల ప్రస్తావనా లేదు.. అసలు రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారనే దానిపై స్పష్టత లేదు.. కేంద్రం ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు ఇచ్చిన ఏహామీని నిలబెట్టుకోలేదు. కేవలం అంతంత మాత్రంగానే నిధులిచ్చారు. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఏపి, తెలంగాణలోని యూనీవర్సిటీలకు కేటాయింపులు మాత్రమే ఇచ్చారు. ఏపిలోని సెంట్రల్ వర్సిటికి రూ.13కోట్లు మరియు ఏపి ట్రైబల్ వర్సిటికి రూ.8 కోట్లు కేటాయించించారు. అదే విధంగా తెలంగాణలోని హైదరాబాద్ ఐఐటీకి రూ.80 కోట్లు మాత్రమే కేటాయించినట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ పట్ల తెలుగుప్రజలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
