కేంద్రం బడ్జెట్‌లో దేశంలోని మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెప్పింది. దీనిలో భాగంగా రూ.5లక్షల వరకూ సాంవత్సరిక ఆదాయాన్ని ఆర్జించే వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో ప్రకటించారు. అయితే ఈ ప్రకటనతో కొన్ని కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు పన్ను భారం నుంచి మినహాయింపు పొందనున్నారు. కానీ రూ.2 కోట్లకు పైగా వార్షికాదాయం ఉన్నవారికి 3 శాతం సర్‌చార్జ్‌ను, రూ.5 కోట్లకు పైగా వార్షికాదాయం ఉన్నవారికి 7 శాతం సర్‌చార్జ్ విధించనున్నట్లు కేంద్ర సర్కారుప్రకటించింది.
Tags amith shah bjp lok sabha minister of central Modi nda Nirmala Seetharaman parlament slider union budjet