ఏపీలో అధికారంలోకి వచ్చిన పార్టీలోకి అప్పుడే వలసలు ప్రారంభం అయినాయి. ప్రతి పక్షంలో ఉన్న టీడీపీ నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి కొంతమంది..రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ వూపు మొగ్గు చూపుతున్నారు.తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి,వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సమక్షంలో అంబికా సంస్థల అధినేత అంబికా రాజా గురువారం వైసీపీలో చేరారు. ఆళ్ల నాని ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ…‘అంబికా రాజా రాష్ట్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పేద ఆర్యవైశ్య ప్రజలకు సాయం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరేలా పని చేయాలి. రానున్న అన్ని స్థానిక సంస్థ ఎన్నికల ఫలితాల్లో వైసీపీదే గెలుపు.’అని ధీమా వ్యక్తం చేశారు. కాగా మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
