ఫేస్ బుక్,వాట్సాప్ నేటి ఆధునీక సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైన సంగతి తెల్సిందే. బ్యాంకులో అకౌంటులేనోళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ కొని అందులో ఫేస్ బుక్,వాట్సాప్ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే అంతగా జీవితంలో భాగమైన ఈ ఫేస్ బుక్,వాట్సాప్ నిన్న బుధవారం సాయంత్రం నుండి ఈ రోజు గురువారం ఉదయం పదిగంటల వరకు పనిచేయకపోయిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈ సమయంలో వాట్శాప్,ఫేస్ బుక్ లో చిత్రాలు,వీడియోలు సెండింగ్,డౌన్లోడ్ కాకుండా పలు సమస్యలు ఎదురయ్యాయి.
దీంతో వాట్సాప్ వారం రోజులు పనిచేయదు అని సోషల్ మీడియాలో వార్తలు వైరలవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎంతవరకు నిజముంది..?. వాట్సాప్ నిజంగా వారం రోజులు పనిచేయదా..?. అయితే ఒక లుక్ వేద్దాం.. ప్రస్తుతం వైరలవుతున్న వార్తల ప్రకారం “కొన్ని సాంకేతిక కారణాల వలన నెట్ వర్కులు రాకపోవడం వలన వాట్సాప్,ఫేస్ బుక్ పనిచేయలేదు..
మరో వారం రోజుల పాటు వాట్సాప్ పనిచేయదని”గూగుల్ పేరిట ఒక వార్త వైరలవుతుంది. అయితే ఈ యాప్ లతోనే ఎటువంటి సంబంధం లేని గూగుల్ సందేశం ఎందుకు పంపుతుంది..?. పైగా సర్వీసులన్నీ పునరుద్ధరించామని ఎఫ్బీ తెలిపింది. మరి వాట్సాప్ వారం రోజులు ఎందుకు పనిచేయదు.. రాత్రి పదకొండున్నర నుండి ఉదయం ఆరు గంటల వరకు వాట్సాప్ పనిచేయదు అని వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవాలు లేవు అని ఎఫ్బీ ఈ సందర్భంగా ప్రకటించింది.