నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బాబాయి ,మాజీ మంత్రి,మాజీ ఎమ్మెల్సీ వైఎస్ వివేకానంద రెడ్డి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు దారుణ హత్యకు గురైన
సంగతి విదితమే. అయితే ఈ హత్యను అప్పటి అధికార టీడీపీ నేతలే చేయించారని ఆరోపణలున్నాయి. తాజాగా ఈ హత్యకు సంబంధించిన కేసులో సంచలనాత్మక ట్విస్ట్ చోటు చేసుకుంది. వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటి
దగ్గర వాచ్ మెన్ గా పనిచేస్తోన్న రంగయ్యకు నార్కో అనాలిసిస్ లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు సిగ్నల్ ఇవ్వడంతో సిట్ అధికారులు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు
వాచ్ మెన్ రంగయ్యను తరలించారు.
