ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు రాజీనామా చేయబోతున్నారని విస్వసనియ సమాచారం. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైసీపీలో చేరడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఒకేసారి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పార్టీలోకి వస్తే.. ఆ ముగ్గురిని గెలిపించుకునే బాధ్యతను వైసీపీ తీసుకుంటుందని హామీ ఇవ్వడంతో ఆ ముగ్గురు అందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆ ముగ్గురు ఎవరు అనేది త్వరలనే బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వారి వారి నియోజక వర్గాల్లో తమ కార్యకర్తలో చర్చించి ..త్వరలనే మీడియా సమవేశం పెట్టి వివరాలు వెల్లడిస్తారని సమచారం. అయితే టీడీపీని వీడి అటు బీజేపీ, ఇటు వైసీపీలోకి వెళ్లేందుకు అనేకమంది రెడీగా ఉన్నారు. అది ఎప్పుడు అనేది చూడాలి
