దివంగత నేత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా రాజకీయ పయనంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. రంగా 72వ జయంతి సందర్భంగా రాధా నుంచి ఈ విషయంపై ఇప్పటికైనా క్లారిటీ వస్తుందని రంగా, రాధా అభిమానులు ఎదురుచూశారు. కానీ రాధా తన పొలిటికల్ ఫ్యూచర్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇటీవల ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో రెండుసార్లు చర్చలు జరపడంతో రాధా మరోసారి పార్టీ మారతారనే సంకేతాలు వెలువడ్డాయి. అయితే రాధా ఈసారి తొందరపడకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే గత సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజులముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన రాధాకు పోటీచేసే అవకాశం లభించలేదు.
నిజానికి ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసిన తప్పు నిర్ణయం తీసుకున్నారని అందరూ భావించారు. టీడీపీలో చేరే విషయంలో అందరూ ఆయనను వ్యతిరేకించారు. అందరూ వద్దన్నా ఎట్టకేలకు టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. మళ్లీ తమపార్టీ అధికారంలోకి వస్తు రాధాకు పదవి ఇస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే టీడీపీ ఘోర ఓటమి తర్వాత రాధా పార్టీలో కొనసాగడంపై డైలామాలో పడ్డారు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ను రెండుసార్లు కలిసి చర్చలు జరిపారు. దీంతో ఆయన జనసేనలోకి వెళ్తారనుకున్నారు కానీ రాధా జనసేనలో చేరే అంశంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.