వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తొలిసారి లోక్‌సభ స్పీకర్ స్థానంలో ఆసీనులైయ్యారు.ప్యానల్ స్పీకర్ హోదాలో లోక్‌సభ నిర్వహిస్తున్నారు. గురువారం మిథున్‌రెడ్డి అధ్యక్షతణ ఆధార్ సవరణ బిల్లుపై చర్చ జరిగింది.ఒకవేళ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు హాజరుకాలేని సమయంలో ఈ కార్యకలాపాలు మొత్తం ప్యానల్ స్పీకర్ నే నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే వైసీపీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి ఇటీవలే లోక్‌సభ ప్యానల్ స్పీకర్‌గా నియమితులు కాగా లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికి తెలిసిందే.మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి మిథున్‌రెడ్డి వరుసగా రెండో సారి విజయం సాధించారు.టీడీపీ అభ్యర్ధి పై 2,68,284 ఓట్ల భారీ మెజారిటీతో మిథున్‌రెడ్డి గెలుపొందారు.