వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్యం సీసాలపై మహాత్మాగాంధీ చిత్రాలను ముద్రించింది ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కంపెనీ.. అయితే అందుకు భారత్‌కు క్షమాపణలు కూడా చెప్పింది. భారతదేశ ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నామని చెప్పింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ కంపెనీ మద్యం సీసాలపై భారత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాలను ముద్రించింది.. అయితే ఈఘటన దేశ ప్రజలకు అవమానకరమని ఎంపీలు తాజాగా రాజ్యసభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సభా చైర్మన్ వెంకయ్యనాయుడు ఈవిషయాన్ని పరిశీలించి తగుచర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ను ఆదేశించారు. దీంతో వివరణ ఇవ్వాలని సంబంధిత కంపెనీకి ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయాధికారులు కోరడంతో క్షమాపణలు చెప్పింది. గాంధీని, ఆయన విలువలను తాము ఎంతగానో గౌరవిస్తామని, ఆయన చిత్రాలను మద్యం సీసాలపై ముద్రించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. దీనిపై భారత ప్రజలకు క్షమాపణలు కోరారు.