నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్ర్తబాబు అరెస్టు కానున్నారా..?.ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు సర్వం సిద్ధమైందా..?. బాబు అరెస్టుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారా..?అవును అనే అంటుంది జాతీయ మీడియా. జాతీయ మీడియాకు చెందిన ఎకనామిక్ టైమ్స్ ,ఔట్ లుక్ ఇండియా సహా ఇతర ప్రధాన జాతీయ మీడియా సంస్థలు నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే అరెస్టు కానున్నారు. ఓటుకు నోటు సహా పలు ఇతర అవినీతి కేసుల్లో చంద్రబాబు నాయుడు అరెస్టు కావచ్చు ఈ పత్రికలు ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించాయి. అంతే కాకుండా తను ముందే అరెస్టు అవుతానని ముందే తెల్సి తమ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను ఇప్పటికే బీజేపీలోకి పంపిన చంద్రబాబు నాయుడు లోక్ సభకు చెందిన ఇద్దరు ఎంపీలను,పదిహేను మంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి పంపడానికి సర్వం సిద్ధం చేశారు. అందుకే బాబు అరెస్టును ముందే గ్రహించిన టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి చేరడానికి సిద్ధమవుతున్నారని బీజేపీకి చెందిన ఏపీ ఇంచార్జ్ సునీల్ దియోదర్ వ్యాఖ్యలు ఆధారంగా ఈ జాతీయ మీడియా ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
