ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ సహ ఇన్ చార్జీ గా వ్యవహరిస్తున్న నేత సునీల్ ధియోధర్ సంచలన వాఖ్యలు చేశారు. తాజాగా వచ్చిన ఒక కథనం ప్రకారం తెలుగుదేశం పార్టీ కి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పారనే వార్త హాల్ చల్ చేస్తుంది. టీడీపీ ప్రతిష్ట దిగజారిందని తెలుసుకున్న ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. చంద్రబాబుతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఏపీలో బలం పుంజుకునేందుకు బీజేపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని.. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో లక్ష మందిని పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వివరించినట్లు తెలుస్తుంది. అయితే దియోధర్ గత కొన్నాళ్లుగా ఇవే విషయాలు చెబుతున్నారు.ఆయన చెప్పే సంగతులు నిజమేనా? అనేది త్వరలోనే తెలుస్తుంది
