ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి చర్యలు తీసుకుంటామని, జిల్లా వాసుల తాగునీటి కష్టాలు తీరుస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందించడమే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో చేసిన అవినీతి నిగ్గు తేలుస్తామని అన్నారు. ప్రజా సంక్షేమానికే జగన్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. తాను ఏ పదవిలో ప్రకాశం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. మరో రెండు వారాల్లో టీటీడీ పాలక మండలి ఏర్పాటు చేస్తామని, తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో సంస్కరణలు తీసుకొస్తామని, స్వామి వారి ఆభరణాల ప్రదర్శన విషయంలో పీఠాధిపతులు, పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని అన్నారు
