టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు రాయుడు ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో టీమిండియా బ్యాకప్ ఆటగాడుగా ఎంపికైన రాయుడు ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లల్లో ఒక్కదాంట్లో కూడా స్థానం సంపాదించుకోలేకపోయాడు. ఇటీవల గాయపడిన విజయ్ శంకర్ స్థానంలో వన్డే మ్యాచ్ లల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని మయాంక్ అగర్వాల్ కు అవకాశం కల్పించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారని క్రికెట్ పండితులు చెబుతున్నారు.
