కేబినెట్ హోదా కల్పిస్తూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కీలక పదవి ఇవ్వనున్నారు.ఇంక ఆ పదవీ విషయానికి వస్తే ఆయనకు ప్రాంతీయ మండలి ఛైర్మన్‌గా అవకాశం రానున్నట్టు సమాచారం. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఈ మూడు జిల్లాలు కలిపి ఒక ప్రాంతీయ మండలిగా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది.ప్రభుత్వం రాష్ట్రంలో కొన్ని జిల్లాన్ని కలుపుకుంటూ ప్రాంతీయ మండళ్లుగా ఏర్పాటు చేసి దానికి సంభందించి వాటికి ఛైర్మన్లను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది.ఈ నేపద్యంలోనే కరుణాకర్ రెడ్డి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రాంతీయ మండలి ఛైర్మన్‌గా నియమితులు కానున్నట్టు తెలుస్తోంది.
