టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ బయటకి వచ్చి మాట్లాడితే తప్పులు వస్తాయని భయపడి ట్వీట్లు పెడుతున్నారని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. లోకేశ్ ట్వీట్లు ఆయనే చేస్తున్నారో.. ఎవరైనా రాస్తున్నారో తెలియదన్నారు.ఆయన ట్వీట్ లు అర్దం ,పర్దం లేకుండా ఉంటున్నాయని అనిల్ ఎద్దేవ చేశారు. గోదావరి నీటితో రాయలసీమ కరువును తొలగించాలనేదే వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన అని తెలిపారు. వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే టీడీపీ నేతలు భయపడుతున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఇరువురు ముఖ్యమంత్రులు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. టీడీపీలో తర్వాతి నాయకుడు ఎవరని వెతుక్కుంటున్నారని వ్యాఖ్యానించారు.
