ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ధేశించిన లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ తరుపున ఈ సంవత్సరం తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా ఒక కోటి (1 కోటి) ఈత,ఖర్జూర మరియు తాటి మెుక్కలు యుద్ద ప్రతిపాదికన నాటాలని మరియు వాటి సంరక్షణ కు చర్యలు చేపట్టాలని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులకు లక్ష్యాన్ని నిర్ధేశించారు. సచివాలయంలో ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క అధికారి పాలు పంచుకోని 100 శాతం విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. కల్లు అమ్మకాలలో దళారుల పాత్ర లేకుండా చేయాలని చేప్పారు. అదే విధంగా గీత కార్మికులు ప్రమాదవశాత్తు ప్రమాదాలకు గురైనప్పుడు వారికి వైద్యం, చికిత్సలను తక్షణం అందేవిధంగా తగు చర్యలు చేపట్టాలని మరియు తాటి , ఈత చెట్లను సంరక్షించడం పై తగు చర్యులు చేపట్టాలని ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. అదే విధంగా గీత కార్మికుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నేతృత్వవంలో అందిస్తున్న అనేక సంక్షేమా పథకాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని వాటి అమలు కోసం ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను కోరారు.