నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన ఆఫర్ ప్రకటించారు. ఈ రోజు బుధవారం రాష్ట్రంలో అమరావతిలో అసెంబ్లీలో జరుగుతున్న రెండు రోజుల ఎమ్మెల్యేలకున్ శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈసందర్బ్జంగా సీఎం జగన్ మాట్లాడుతూ”ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలుగా అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ ,ఎమ్మెల్యే యొక్క విధులు,నియమాలు అన్నిటి గురించి క్షుణంగా తెలుసుకోవాలి.
ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి ఫలాలను అందించాలని “సూచించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”ప్రజలు మనపై ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పని చేయాలి అని అన్నారు. అయితే ఈ క్రమంలో కొంతమంది ఇతర పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీలో జాయిన్ అవుతారని సీఎం జగన్ కు
తెలిపారు.
దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ”ఎవరు పార్టీ మారిన కానీ పార్టీ వలన సంక్రమించే పదవులకు,ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వైసీపీలోకి రావచ్చు”అని పార్టీ మారాలనుకుంటున్నవారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ సాక్షిగా టీడీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావాలనుకుంటున్నారు. కానీ నేను పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి. లేకపోతే స్పీకర్ వారిపై వేటు వేయాలని సూచిస్తున్నాను అని ప్రకటించిన సంగతి విదితమే.