భారతదేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ వరుస సోదాలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. సీబీఐకి చెందిన అవినీతి నిరోధక శాఖ దేశవ్యాప్తంగా రెండోరోజూ సోదాలు నిర్వహిస్తోంది. తాజాగా 14 కీలక కేసులకు సంబంధించి దేశంలోని 12 రాష్ట్రాల్లో గల 18 నగరాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు చేపట్టింది. మొత్తం 50కి పైగా ప్రాంతాల్లో ఈ సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు, కంపెనీలు, వాటికి ప్రమోటర్లుగా ఉన్న వారి ఇళ్లల్లో ఈ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం కూడా సీబీఐ ఇలాంటి తరహా తనిఖీలను వివిధ ప్రాంతాల్లో నిర్వహించింది. కోల్‌కతాలోని 22చోట్ల సీబీఐ సోదాల్లో పాల్గొంది.
పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు ఈ సోదాల్లో పాలుపంచుకుంటుండగా దేశవ్యాప్తందా సీబీఐ కొరడా ఝుళిపిస్తుండడంతో బడాబాబుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో సీబీఐని నిషేధించిన చంద్రబాబు తన పదవీ కాలం అయ్యేవరకూ తమకు చెందిన అక్రమాస్తులను కాపాడుకోగలిగారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక సీబీఐని రాష్ట్రంలోకి అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే తాజాగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలతో చంద్రబాబు అండ్ కో గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఒక వేళ చంద్రబాబు అక్రమాలపై విచారణ జరిగితే ఆయన అరెస్టయ్యే అవకాశాలు నూటికి నూరుశాతం కనిపిస్తోందని వైసీపీ శ్రేణులు చెప్తున్నారు.