Home / 18+ / వాట్సాప్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ పోటీ.. అసలు టెలికం రంగంలో ఏం జరుగుతోంది

వాట్సాప్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ పోటీ.. అసలు టెలికం రంగంలో ఏం జరుగుతోంది

ప్రైవేట్‌ టెల్కోల రాకతో వెనుకబడిన ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ జోరు పెంచుతోంది. తాజాగా వాట్సాప్‌ వంటి ఓవర్‌–ది–టాప్‌ సంస్థలతో పోటీపడేందుకు సిద్ధమవుతుంది. వైఫై ద్వారా కాల్స్‌ చేయడం, రిసీవ్‌ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టే యత్నాల్లో ఉంది. ఇందుకు సంబంధించిన అడ్వాన్స్‌డ్‌ వాయిస్‌ ఓవర్‌ వైఫై వీవోవైఫై సర్వీసులను పరీక్షిస్తోంది. అత్యుత్తమ టెక్నాలజీతో నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంపికచేసిన సర్కిల్స్‌లో ప్రస్తుతం వీటిని పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని సర్కిల్స్‌లోనూ ఈసేవలు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ముందుగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, స్పెక్ట్రం అంతగా అందుబాటులో ఉండని మారుమూల ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తేవాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ యోచిస్తోంది. అలాగే ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ వంటి సంస్థలు కూడా వీవోవైఫై సర్వీసులను పరీక్షిస్తున్నాయి.

ఇవి తుదిదశలో ఉండగా త్వరలో సేవలు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నాయి. వాటికన్నా ముందే రంగంలోకి దిగాలని, మార్కెట్‌ను దక్కించుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ పావులు కదుపుతోంది. మొబైల్‌ కు సిగ్నల్‌ లేకపోయినా కనెక్టివిటీ దెబ్బతినకుండా చూసే టెక్నాలజీగా వీవోవైఫైకి ప్రపంచవ్యాప్త గుర్తింపుఉంది. వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ద్వారా కాల్స్‌ చేయడం, రిసీవ్‌ చేసుకోవడాన్ని సాధారణంగా వైఫై కాలింగ్‌ అంటారు. ప్రస్తుతం వాట్సాప్, స్కైప్, హైక్, ఫేస్‌బుక్, గూగుల్‌ వంటి సంస్థలు ఈ సేవలు అందిస్తున్నాయి. అయితే, టెల్కోల్లాగా లైసెన్సు బాదరబందీ లేని ఈసంస్థలు తమ వాయిస్‌ సేవల విభాగం ఆదాయానికి గండి కొడుతున్నాయంటూ టెలికం సంస్థలు ఎప్పటినుంచో గగ్గోలు పెడుతున్నాయి. ఓటీటీ సంస్థలు కూడా తమ కాలింగ్, మెసేజింగ్‌ సర్వీసులను అందిస్తున్నాయి కాబట్టి వాటిని సైతం లైసెన్సింగ్‌ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్‌ వినిపిస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat