టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు అందరిని ఆశ్చర్యపరిచేలా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతునట్లు ప్రకటించాడు.ఈ మేరకు బీసీసీఐకు లిఖిత పుర్వకంగా లెటర్ కూడా రాసి పంపాడు. రాయుడు మూడు ఫార్మాట్ లకు గుడ్ బై చెప్పేసాడు.ప్రస్తుత ప్రపంచకప్ కు ఇండియాకు బ్యాకప్ ప్లేయర్ గా ఎంపికైన రాయుడుకి నిరాశే మిగిలింది ఎందుకంటే..భారత జట్టు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గాయం కారణంగా ఇండియాకు తిరిగి వచ్చేసాడు.అతడి స్థానంలో కర్ణాటక ప్లేయర్ మయాంక్ అగర్వాల్ ను తీసుకున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాయుడు నిర్ణయం తీసుకున్నాడు. అయితే అగర్వాల్ ని తీసుకోవడం వెనుక చాలా పెద్ద రాజకీయమే జరిగిందని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి.రాయుడు అభిమానులు మాత్రం బీసీసీఐ ని దుమ్మెత్తిపోస్తున్నారు.