మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్ పై ఇంకా పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. శివరామ్ తన నుంచి ‘కే ట్యాక్స్’ వసూలు చేశాడంటూ మంగళవారం మరో బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇది వరకే ఫిర్యాదు చేసిన ఇంకో బాధితుడు తన డబ్బు ఇప్పించాలంటూ సత్తెనపల్లికి చెందిన భోజనాల కాంట్రాక్టర్ వై.శ్రీనివాసరావు గుంటూరులోని కోడెల శివరామ్‌కు చెందిన షోరూం ఎదుట ఆందోళనకు దిగాడు. తనకు చెల్లించాల్సిన రూ.11 లక్షలు ఇస్తే.. తప్ప తాను ఇక్కడ నుండి కదలబోనని.. డబ్బులు ఇవ్వకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. కోడెల శివరామ్‌ను చూసినప్పుడల్లా ఆంధ్ర నయీమ్‌లాగే అనిపించేదని అతను వాపోయాడు.
