మహేంద్రసింగ్ ధోని..ప్రంపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని వాడు లేడు.ధోని భారత్ కు దొరికిన ఒక ఆణిముత్యంమని చెప్పాలి.ఎందుకంటే అతడు టీమిండియాకు ఎనలేని సేవలు అందించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు తన సారధ్యంలో ఇండియా కు అందించాడు.అంతేకాకుండా టెస్ట్ మ్యాచ్ లో ఇండియాను నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చిన ఘనత ధోనిదే.ఆస్ట్రేలియా గడ్డపై ఏ కెప్టెన్ సాధించని రికార్డ్ ధోనినే బద్దలుకొట్టాడు.2007లో టీ20 వరల్డ్ కప్,2011లో ప్రపంచకప్ సాదించిన ఘనత ధోనిదే.ఇక అసలు విషయానికి వస్తే టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు ఈరోజు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం అందరికి తెలిసిందే.
అయితే ఇప్పుడు అందరి కళ్ళు ధోని పైనే పడ్డాయి.కాని ధోని ఇంతకు ముందే చెప్పిన ప్రకారం ఈ ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ అవకాశం ఉంది.ఇప్పటికే సెమీస్ కు చేరిన టీమిండియా విజయానికి రెండు అడుగుల ముందే ఉంది.ఒకవేళ భారత్ సెమీస్ లో గెలిస్తే లార్డ్స్ లో జరగనున్న ఫైనల్ మ్యాచ్ నే ధోనికి చివరి మ్యాచ్ అని చెప్పాలి.అదృష్టం బాగుండి ఫైనల్ లో భారత్ గెలిస్తే ధోనికి మాత్రం ఘనంగా వీడ్కోలు ఇస్తారని అర్ధమవుతుంది.అయితే ధోని ఫైనల్ మ్యాచ్ అనంతరం తప్పుకుంటాడా లేదా ఇంకా టైమ్ తీసుకుంటాడా అని అందరి మదిలో ఉన్న ప్రశ్న.ధోని పై ఎవరు ఎన్ని విమర్శలు జల్లినా బీసీసీఐ మాత్రం వాటికి పట్టిచుకోకుండా ధోనికే సపోర్ట్ చేయడం విశేషం.