చాలా మంది తమ గదులలో దేవుళ్లు, దేశనాయకుల ఫోటోలు పెట్టుకుంటారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన గదిలో ఎన్నికల మేనిఫెస్టోను పెట్టుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మొగళ్లూరులో ఉపాధ్యాయుడి ఉద్యోగ విరమణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతీరోజు ఆయన ఎన్నికల మేనిఫెస్టోను చూస్తూ దీన్ని ఎలా అమలుపరచాలో ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. కొన్ని పేద కుటుంబాల్లో పిల్లలను చదివించలేకపోవడంతో వారు బాలకార్మికులుగా మారుతున్నారని, దీన్ని గమనించిన ముఖ్యమంత్రి జగన్ అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, ఎంఈవో బాలకృష్ణారెడ్డి, ఏపీటీ ఎఫ్ నాయకులు కే వెంకటేశ్వరరావు, డాక్టర్ శ్రీహరి, వైసీపీ నాయకులు జీ గోపాల్‌రెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
