ప్రపంచ కప్ లో భాగంగా టీమ్ ఇండియా బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతున్న సంగతి విదితమే.అందులో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా ఓపెనర్లను 5వికెట్లను కోల్పోయి 44ఓవర్లకు 277పరుగులను సాధించింది. క్రీజులో ఎంఎస్ ధోనీ 10 పరుగులతో ఉన్నాడు.అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ 92బంతుల్లో 102(5సిక్సర్లు,7ఫోర్లు),కేఎల్ రాహుల్ 92బంతుల్లో 77(1సిక్సర్,6ఫోర్లు)పరుగులకు ఔటయ్యారు. అయితే ఈ క్రమంలో ఒకే మ్యాచ్లో రోహిత్ శర్మ మూడు రికార్డ్లను తన సొంతం చేసుకున్నాడు. అందులో భాగంగా వన్డే మ్యాచ్లో అత్యధిక సిక్సులు(230)కొట్టిన బ్యాట్స్ మెన్ గా చరిత్రకెక్కాడు. ఒక ప్రపంచకప్ లో అత్యధిక సెంచరీలు(4)చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ కప్ చరిత్రలో భారత్ కు అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (180)ఈ మ్యాచ్లో నమోదైంది.ఇప్పటివరకు ఈ ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు(544)సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు..
