తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కాలనీకి చెందిన ఎల్‌ఐసీ కృష్ణ, చంద్రకళ దంపతుల కుమారుడు నిఖిల్‌సాయి యాదవ్ 2018 సెప్టెంబర్ 9న దేశ వ్యాప్తంగా 208 ఆర్మీ, 42 నేవీ, 92 ఎయిర్ ఫోర్స్‌కు గాను యూపీఎస్‌సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎంట్రెన్స్ ఎగ్జాం నిర్వహించింది. ఇందులో దేశవ్యాప్తంగా 3.12 లక్షల మంది విద్యార్థు లు ఎంట్రెన్స్ టెస్టు రాయగా అందులో 6,800 మంది అర్హత సాధించారు. నవంబ ర్ 30న ఎంట్రెన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. అన్ని పరీక్షల్లోనూ అర్హత సాధించడంతో యూపీఎస్‌సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)లో మూడేళ్ల ప్రవేశానికి చోటు కల్పిస్తూ యూపీఎస్‌సీ ధ్రువీకరించింది. జూలై 2న పుణెలోని కడక్‌వాస్‌లో గల ఎన్‌డీఏలో చేరనున్నారు. అక్కడ మూడేళ్లపాటు ఎయిర్ ఫోర్స్‌తోపాటు బీటెక్ చేయిస్తారు. ఇందుకు సంబంధించి ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించనుంది. శిక్షణ పూర్తయిన తర్వాత ఏడాదిపాటు ట్రైనీ ఫ్లయింగ్ ఆఫీసర్‌గా శిక్షణ ఇస్తారు. అనంతరం అధికారికంగా నియమాక పత్రం అందజేస్తారు. దీంతో యుద్ధ విమానాలు నడిపే పైలెట్‌గా దేశానికి సేవ చేయాల్సి ఉంటుంది.
