ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు నగదు బదిలీ చేసినందుకు చంద్రబాబు పథకాలపై సుప్రీం కోర్ట్ ఈ నోటీసులిచ్చింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు బదిలీ పథకంపై నిషేధం విధించాలని సుప్రీంలో పిటిషన్ వేసారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో పెద్ద ఎత్తున నగదు పంపిణీ చేశారని వివరించిన పిటిషనర్ పేర్కొన్నారు. అయితే ఆ పిటిషన్ను అనుమతించిన సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ పథకాలను చట్టవిరుద్ధమైనగా రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని ఆదేశించింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు బదిలీ పథకాలు లేకుండా మార్గదర్శకాలను రూపొందించాలని కోరింది. అయితే ఇదే విచారణ వేగవంతమై ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను చంద్రబాబుపై విచారణ జరిగే అవకాశాలు విచారణనుబట్టి అరెస్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
