మెగా ఫ్యామిలీ నటవారసురాలయిన కొణిదెల నీహారిక ‘ఒక్క మనసు’తో కొందరి మనసులే గెలుచుకుంది. కాని అంతే విమర్శలు అందుకుంటుంది..ఎందుకంటే ఇటీవల వైజాగ్ బీచ్‌కి వెళ్లినప్పుడు నీహారిక బీచ్ ఒడ్డున కొన్ని ఫోటోలు తీసుకుంది. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలను చూసిన మెగా అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కొందరైతే కామెంట్లు పెడుతున్నారు. పైన షర్ట్ వేసుకున్నావు బాగానే వుంది కానీ కింద ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయావా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి వారి పరువు తీసేలా డ్రెస్ ఎలా వేసుకుంటావ్ అంటూ నీహారికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.