మావారైతే ముక్కలుముక్కలుగా నరికేసేవారు – కేశినేని నాని
మేమైతే ఇంకా భారీగా ప్లాన్ చేసేవారం – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
పార్టీ పగ్గాల కోసం ఆయన తల్లి హత్యాయత్నం చేయించారు – రాజేంద్రప్రసాద్
షర్టు కూడా చినగలేదు,నేరుగా ఇంటికి పోయాడాడు – అచ్చెన్నాయుడు
ఇవి అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం జరిగిన వెంటనే TDP నేతలు చేసిన వ్యాఖ్యలు.. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది.. YCP కి అనుకున్నదానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. అయినా మీడియా పరంగానూ, వ్యవస్ధలకు సంబంధించి కొన్ని అంశాలను మేనేజ్ చేసేక్రమంలో మెజారిటీ చంద్రబాబుకే ఉందన్నది చేదు నిజంగా వైసీపీ అభిమానులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎల్లో మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదట.. సరైన ప్రత్యామ్నాయ మీడియా ఉన్నప్పుడే YCP కి రాజకీయంగానూ, ఇటు సమాజానికీ మంచి జరుగుతుంది.
వైసీపీకి ఉన్న ఒక్క సాక్షి సరిపోదు అలాగే సోషల్ మీడియాలో కూడా పార్టీకి పఠిష్టమైన శ్రేణులున్నా వారిని వినియోగించుకోవడంలో వైసీపీ విఫలమయ్యింది. అందరినీ ఒక తాటిపైకి తెచ్చుకుని ఒక ఆర్గనైజ్డ్ గా వినియోగించుకుంటే పార్టీకి, ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగముంటుందనేది వైసీపీ సోషల్ మీడియా సైనికుల వాదన. వైసీపీ సోషల్ మీడియాలో కుమ్ములాటలు జరిగితే ప్రత్యర్ధులకు మరింత చులకనయ్యే అవకాశాలున్నాయి.. ఇక వ్యవస్ధల విషయానికొస్తే జగన్ పై హత్యాయత్నం తర్వాత జగన్ని ముక్కలు ముక్కలుగా చేస్తామనీ, ఆయన్ని చంపాలని ఆయన తల్లీ, చెల్లీ ప్రయత్నించారనీ, మేమైతే భారీగా ప్లాన్ చేసేవారమనీ వికృత వ్యాఖ్యలు చేసినవారిపై చర్యలు తీసుకోలేకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు కచ్చితంగా వెళ్ళే అవకాశముంది. అలాగే వివేకా హత్యపై సత్వర దర్యాప్తు జరగాల్సిఉంది. ఇక చంద్రబాబు అవినీతిపై దశాబ్దాలుగా పత్రికల్లో చదివి జనం విసిగిపోయారు.. చంద్రబాబు అవినీతిపరుడన్న సంగతి ఇప్పుడు జగన్ సోషల్ మీడియా ప్రత్యేకంగా చెప్పాల్సినస అవసరం లేదు.. అసలు చంద్రబాబును విచారించే దమ్ము కేంద్ర ప్రభుత్వానికి ఉందా.? లేదా.? అన్న విషయంపై స్పష్టతనివ్వాలనేది వారి వాదన.