వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల రోజుల పాలనపై ప్రతిపక్ష టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఇన్‌చార్జ్ కిల్లి కృపారాణి అన్నారు. గత ప్రభుత్వ పాలనలోని అవినీతి వెలికి తీసి, అక్రమ నిర్మణాలపై చర్యలు తీసుకుంటే దానిని కక్ష సాధింపు చర్య అని ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అవినీతి రహిత, పారదర్శక, సామాజిక విప్లవం తెచ్చే పాలన చేస్తున్న ఏపీ సీఎం. జగన్మోహన్‌రెడ్డిని అభినందించాలని అన్నారు.
