ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఇంగ్లాండ్,భారత్ మధ్య జరిగిన హోరాహోరి పోరులో చివరకు ఆతిధ్య జట్టే విజయం సాధించింది.దీంతో అటు పాకిస్తాన్,బంగ్లాదేశ్ జట్లకు ఇది గట్టి దెబ్బ అని చెప్పాలి. అయితే నిన్న ముందుగా టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకోగా ఓపెనర్స్ ఇద్దరూ భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.భారత్ బౌలర్స్ ను ధీటుగా ఎదుర్కొని మంచి ఆటను కనబరిచారు.ఫలితమే ఇంగ్లాండ్ నిర్ణిత 50ఓవర్స్ లో 337 చేసింది.చేసింగ్ కి వచ్చిన భారత్ ఓ పరంగా మంచి బ్యాట్టింగ్ ఆడినప్పటికీ చివరికి ఓటమి చవిచూసింది.ఈ మ్యాచ్ లో భాగంగా భారత జట్టు సారధి మరో అరుదైన ఘనత సాధించాడు.వరుసగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్ తో ఆడిన మ్యాచ్ లలో అర్ధ శతకాలు బాదాడు.వరల్డ్ కప్ లో వరుసగా 5 అర్ధ శతకాలు కొట్టిన కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు.
