ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. గడిచిన ఎనికల్లో రాష్ట్ర వాప్తంగా తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 3 ఎంపీ సీట్లు సాదించింది. అయితే గెలిచిన వారిలో అప్పుడే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ 23 మందిలో చంద్రబాబుతో ఐదేళ్ల పాటు ఎంతమంది ప్రయాణం చేస్తారు అనేది ఇప్పడే ఏసీలో హాటా టాపిక్ గా మారింది. మరి కొన్నొ రోజుల్లో 23 మందిలో కనీసం సగం మంది కూడా టీడీపీలో ఉండేలా లేరు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీ వాళ్లతో టచ్‌లోకి వెళ్లిపోయారు. అయితే జగన్‌కు ఏకంగా 151 సీట్లు రావడంతో టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఆయనకు రాలేదు.కాని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు అప్పుడే బీజేపీ నేతలతో పార్టీ మారే అంశంపై చర్చిస్తున్నారు. టీడీపీ నుంచి ఏకంగా 16 మంది వరకు ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవాలని పక్కా ప్లాన్ చేస్తుంది. అయితే తాజాగా టీడీపీలో ఉన్న ఒక ఎమ్మెల్యే మాత్రం వైసీపీలో చేరే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే చేరికకు జగన్ కూడా దాదాపు గ్రీన్‌సిగ్నల్ ఇస్తారని అంటున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. రాయల సీమలో టీడీపీకి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. చంద్రబాబు, బాలయ్య కాకుండా కేశవ్ మాత్రమే గెలిచారు. ఇప్పుడు ఈయన కూడ వైసీపీలో చేరితే ఇక సీమలో బావ , బామార్ధులే మిగులుతారు. చూడాలి ఏం జరుగుతందో
