టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వైసీపీ అధినేత, ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ట్వీట్టరు లో విరుచుకుపడుతున్నారు. రాజన్న రాజ్యం అంటే విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్ లో ఎదురుచూపులు, లాఠీఛార్జ్ లో దెబ్బలు తినాలి అని మరోసారి గుర్తుచేసారు. ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో అవినీతి అంటూ బురద జల్లే కార్యక్రమాలతో కాలయాపన మాని రైతులకు విత్తనాలు అందించే పని మొదలు పెట్టండి.
రైతులకు విత్తనాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు, రాష్ట్రానికి నీళ్లు తెస్తా అని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగారితో చర్చలకు వెళ్లారట. అనంతపురం, విజయనగరం, నెల్లూరు ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ‘విత్తనాలో జగన్ గారూ’.. అంటూ రైతులు రోడ్డెక్కుతున్నారని ట్విట్టర్‌లో లోకేష్ సూచనలు చేశారు. అయితే ఇప్పుడు ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో వైసీపీ ఫ్యాన్స్ కంటపడ్డాయి. దీంతో గతంలో నారా లోకేష్ మాట్లడినా మాటలు….మాట తడబడే వాఖ్యలలో ట్రోల్ చేస్తున్నారు. నారా లోకేష్ నువ్వు కూడ జగన్ విమర్శిస్తున్నావ అంటూ వైసీపీ అభిమానులు తెగ హల్ చల్ చేస్తున్నారు.