ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసిన విషయం అందరికి తెలిసిందే.మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 23 సీట్లు గెలుచుకొని సరికొత్త చెత్త రికార్డు నెలకొల్పింది.జగన్ దెబ్బకు టీడీపీ లోని హేమాహేమీలు సైతం ఘోరంగా ఓడిపోయారు.మంత్రులు,సీనియర్ నాయకులు జగన్ దెబ్బకు కోలుకోలేకపోతున్నారు.ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం చంద్రబాబుకు ముందు నుయ్య వెనక గొయ్య అన్నట్టుగా ఉంది.ఈ ఐదేళ్ళు టీడీపీ పరిస్థితి ఏమిటి అనేది పక్కన పెడితే బాబుకి మరో తలనొప్పి మొదలైంది.ఇప్పటికే టీడీపీ ఎంపీలు నలుగురు బీజేపీలో చేరిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఇప్పుడు ఉన్న కొంతమంది టీడీపీ కాపు నేతలు కూడా అదే బాట పట్టనున్నారని సమాచారం.
చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్ళిన సమయంలో కాకినాడలోని తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో కాపుల మీటింగ్ జరిగింది.ఈ మీటింగ్లో బీజేపీలో చేరే అంశంపై చర్చించుకున్నట్టు తెలుస్తుంది.అయితే చంద్రబాబు వచ్చాక వాళ్ళని మీటింగ్ కి పిలిచిన వాళ్ళు రాకపోవడం తర్వాత బీజేపీ నాయకుల్ని కలుస్తున్నారే వార్త జోరుగా నడుస్తుంది.అయితే ఈసారి చంద్రబాబు గుంటూరు లో పార్టీ ఆఫీస్ లోనే ఉంటారు.ఈ మేరకు కాపు నేతలు ఇక్కడ భేటి కానున్నారని సమాచారం.అనంతరం బీజేపీ నేత జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తోనూ భేటీ కానున్నారని తెలుస్తుంది.అదేకాని జరిగితే చంద్రబాబు ఒంటరి కాక తప్పదు.